LOADING...
Peddi: 'రాంబుజ్జి' ఎంట్రీ అదుర్స్.. 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ రిలీజ్
'రాంబుజ్జి' ఎంట్రీ అదుర్స్.. 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ రిలీజ్

Peddi: 'రాంబుజ్జి' ఎంట్రీ అదుర్స్.. 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2026
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి చిత్రబృందం కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో 'రాంబుజ్జి' అనే పవర్‌ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. "రాంబుజ్జికి హాయ్ చెప్పండి" అంటూ క్యాప్షన్‌ను కూడా పంచుకుంది. 'మిర్జాపూర్' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దివ్యేందు శర్మ ఈ చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకుంటున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది.

వివరాలు

మే 18న ట్రైలర్ రిలీజ్

"ఇక అసలు ఆట మొదలవబోతోంది" అంటూ చిత్రబృందం చేసిన పోస్ట్‌తో ప్రమోషన్స్ వేగం పెరిగింది. అలాగే సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను రత్నవేలు, ఎడిటింగ్ పనులను జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది

Advertisement