Ram Charan: డల్లాస్‌లో రామ్‌చరణ్ అయ్యప్ప దీక్ష విరమణ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతేడాది అయ్యప్ప మాలధారణ వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్ష చేపట్టారు. మరోవైపు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో డిసెంబర్ 21న డల్లాస్ నగరంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలో రామ్ చరణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్, ఎస్.జే. సూర్య వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు
ఈ వేడుక కోసం అమెరికాలో ఉన్న అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. రామ్ చరణ్ తన అయ్యప్ప దీక్షను డల్లాస్ నగరంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో విరమించనున్నారు. అనంతరం రామ్ చరణ్ ఫ్రీవేరు అవుట్‌ఫిట్‌లోనే ఈ గ్రాండ్ ఈవెంట్‌లో కనిపించనున్నట్లు సమాచారం. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా, శ్రీకాంత్, ఎస్.జే. సూర్య వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి పండగ సీజన్‌ను టార్గెట్ చేసుకున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా డల్లాస్ ఈవెంట్ ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.