David Reddy: 'డేవిడ్ రెడ్డి'లో రమ్యకృష్ణ.. కమలారెడ్డి ఫస్ట్ లుక్ అదిరింది!
ఈ వార్తాకథనం ఏంటి
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'డేవిడ్ రెడ్డి'. ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆమె 'కమలారెడ్డి' అనే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. 'బాహుబలి'లో శివగామిగా తనదైన ముద్ర వేసిన రమ్యకృష్ణ.. మరోసారి అదే తరహాలో చాలా పవర్‌ఫుల్‌గా, ఫియర్స్‌గా కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'డేవిడ్ రెడ్డి' నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాలో రమ్యకృష్ణ పోషిస్తున్న కమలారెడ్డి పాత్ర కథకు, సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుందని మేకర్స్ తెలిపారు.
వివరాలు
కీలక పాత్రలో సముద్రఖని, అభయ్ డియోల్
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరియా రియాబోషాప్కా కథానాయికగా నటిస్తున్నారు.
సముద్రఖని, అభయ్ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.