Rana 2. Net Filx- Second Season: రానా 2 వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో ఏజెంట్ విలన్ డినో మోరియా
విక్టరీ వెంకటేష్ (Venkatesh),దగ్గుబాటి రానా (Rana)కలసి నటించిన రానా వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించినందుకు గాను వెంకటేష్ ఎంతో నెగెటివిటీని మూటగట్టుకున్నారో తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ కోసం వీరిద్దరూ ఎంత కష్టపడినా..వారి నోటి వెంట కొన్ని కొన్ని సన్నివేశాల్లో పరుష పదజాలం వెలువడటంతో మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్నినేరుగా సోషల్ మీడియాలో చెప్పేయడంతో రానాను నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇన్నాళ్లూ ఫ్యామిలీ తో కలసి సినిమా చూసేలా పకడ్బందీగా కెరీర్ ను నిర్మించుకున్నఈ సీనియర్ హీరో నుంచి అటువంటి బూతు మాటలతో కూడిన పాత్ర ను ఎవ్వరూ ఊహించలేకపోయారు.
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో డినో మోరియా
అయితే ఈ వ్యతిరేకతనుంచి బయట పడేందుకు ఇంకెప్పుడూ ఇటువంటి పాత్రలో నటించమని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వెంకటేష్ కు. అయితే ఇప్పుడు రానా వెబ్ సిరీస్ కు తాజా అప్ డేట్ ఏమిటంటే దీని సీక్వెల్ కూడా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుందట. ఏజెంట్ సినిమాలో విలన్ పాత్ర పోషించిన డినో మోరియా రానా 2 సీజన్ లో కీలక పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ శనివారం వెల్లడించారు. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో డినో మోరియా నటించనున్నట్లు సమాచారం.
అమెరికన్ క్రైమ్ సిరీస్ రే డొనెవెన్ ను రీమేక్ గా తీసిన రానా
ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది. మిగత స్టార్‌నటులు కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టే అవకాశముందని నెట్ ఫ్లిక్స్ యూనిట్ చెబుతోంది. అమెరికన్ క్రైమ్ సిరీస్ రే డొనెవెన్ ను రీమేక్ గా తీసిన రానా మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి సెకండ్ సీజన్ ఎలా ఉంటుందో ...ఎంత క్లీన్ గా ఉంటుందో విడుదల వరకూ వేచి చూడాల్సిందే.