LOADING...
Rana Daggubati: సోనమ్ కపూర్‌కు క్షమాపణలు చెప్పిన రాణా దగ్గుబాటి 
Rana Daggubati: సోనమ్ కపూర్‌కు క్షమాపణలు చెప్పిన రాణా దగ్గుబాటి

Rana Daggubati: సోనమ్ కపూర్‌కు క్షమాపణలు చెప్పిన రాణా దగ్గుబాటి 

వ్రాసిన వారు Stalin
Aug 15, 2023
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన 'కింగ్‌ ఆఫ్‌ కోథా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాణా దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో తన మాటల కారణంగా ఇబ్బంది పడుతున్న దుల్కర్‌ సల్మాన్‌, సోనమ్ కపూర్‌కు సోషల్ మీడియా వేదికగా రాణా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తాము మంచి స్నేహితులమని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని రాణా చెప్పారు. 'కింగ్‌ ఆఫ్‌ కోథా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రాణా మాట్లాడుతూ, దుల్కర్‌కు సహనం ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను రాణా ప్రస్తావించారు.

రాణా

వివాదానికి ముగింపు పలకండి: రాణా 

ఓసారి దుల్కర్ సినిమా షూటింగ్‌‌కు తాను వెళ్లినప్పుడు, ఆ మూవీ హీరోయిన్ దురుసుగా ప్రవర్తించిందని రాణా వివరించారు. ఆమె దుల్కర్ సమయాన్ని చాలా వృథా చెసినట్లు రాణా వెల్లడించారు. దుల్కర్ ఆమె కోసం వెయిట్ చేస్తుంటే, ఆమె మాత్రం తన భర్తతో షాపింగ్ గురించి తెగ మాట్లాడుతుందని రాణా వివరించారు. అది చూసిన తనకు చాలా కోపం వచ్చిందని రాణా చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అనుకొని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు మంగళవారం ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వల్ల దుల్కర్, సోనమ్ ఇబ్బందని పడటం తనకు ఇష్టం లేదన్నారు. వివాదాని ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.