రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబో సినిమా మొదలు?
ఈ వార్తాకథనం ఏంటి
దుల్కర్ సల్మాన్.. మళయాలీ హీరో అయినా కూడా తెలుగులో మంచి పాపులారిటీ ఉన్న నటుడు. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
ఆ తర్వాత మహానటి సినిమాతో హిట్ అందుకున్నాడు. గతేడాది సీతారామం సినిమాను ప్రేక్షకులను అందించి, వాళ్ళ అభిమానాన్ని పొందాడు.
సీతారామం సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇప్పట్లో మర్చిపోలేరు. సీతారామం తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేస్తున్నాడు దుల్కర్. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
అయితే తాజాగా మరొక తెలుగు సినిమాకు దుల్కర్ సైన్ చేసాడట. రానా నిర్మాతగా ఆ సినిమా రూపొందబోతుందని సమాచారం.
Details
స్పిరిట్ బ్యానర్ లో రూపొందే చిత్రం
యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడానికి స్పిరిట్ అనే బ్యానర్ ను గతంలోనే స్టార్ట్ చేసాడు రానా. ఇప్పుడు ఈ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో పనిచేస్తున్న కుర్ర దర్శకుడికి ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఇస్తున్నారట.
తెలుగులో తెరకెక్కే ఈ సినిమా, తమిళం, మళయాలం భాషల్లో విడుదల కానుందని అంటున్నారు. ఈ విషయమై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.
అదలా ఉంచితే, ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోథ అనే సినిమాలో నటిస్తున్నాడు దుల్కర్. ఈ సినిమాను ఆగస్టు 24న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.