
రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ పెళ్ళి ఫిక్స్: పెళ్ళికూతురు ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయమై తండ్రి సురేష్ బాబు స్పందించారు.
అభిరామ్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని, తమ బంధువుల అమ్మాయితో అభిరామ్ వివాహం జరగబోతుందని సురేష్ బాబు వెల్లడి చేశారు.
పెళ్లికూతురు ఎవరంటే?
మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు తమ్ముడి మనవరాలితో అభిరామ్ వివాహం జరగబోతుందని తెలుస్తుంది. అంటే సురేష్ బాబు సోదరి కుమార్తెను అభిరామ్ వివాహం చేసుకోబోతున్నాడు.
అమ్మాయి పేరు ఇంకా బయటకి రాలేదు. అభిరామ్ ఇంకా ఆ అమ్మాయి చిన్నప్పటినుండి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ఇప్పుడు తమ ఇష్టాన్ని పెద్దలకు తెలియజేశారని దాంతో వివాహాన్ని నిశ్చయం చేశారని తెలుస్తోంది.
Details
శ్రీలంకలో అభిరామ్ వివాహ వేడుక
దగ్గుబాటి అభిరామ్ వివాహ వేడుక శ్రీలంకలో జరగనుందని వినిపిస్తోంది. దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక ఉండనుందని అంటున్నారు.
డిసెంబర్ నెలలో వివాహానికి ముహూర్తం కుదిర్చినట్లు ఫిలింనగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
తేజ దర్శకత్వంలో తిరకెక్కిన అహింస సినిమాతో దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ప్రస్తుతం బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో అభిరామ్ ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామానాయుడు స్టూడియోస్ పక్కన కాఫీ షాప్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.