
భళ్ళాలదేవుడు రానాకు కంటి చూపు సమస్య, కిడ్నీ మార్పిడి, అనారోగ్య విషయాలు పంచుకున్న రానా
ఈ వార్తాకథనం ఏంటి
రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా, ఆ సిరీస్ ప్రమోషన్లలో ఆక్టివ్ గా పాల్గొంటున్నాడు. రానా నాయుడు సిరీస్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.
సిరీస్ లో ఎక్కువ శాతం బూతులు ఉన్నాయంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. అదలా ఉంచితే, తాజాగా ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా, తన అనారోగ్యం గురించి చెప్పుకొచ్చాడు.
తనకు ఒక కన్ను కననడదనీ, గతంలో ఒక షోలో చెప్పుకొచ్చాడు రానా. ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడుతూ, తనకో పిల్లాడు కనిపించాడని, వాళ్ళ అమ్మకు ఒక కన్ను కనిపించకపోతే అతను చాలా బాధపడ్డాడనీ, అతన్ని దగ్గరకు తీసుకుని, అదేమంత పెద్ద విషయం కాదన్నట్టుగా ధైర్యం చెప్పానని అన్నాడు.
రానా దగ్గుబాటి
బీపీ సమస్యల వల్ల ఇబ్బందులు పడ్డ రానా దగ్గుబాటి
ఆ పిల్లాడికి తన కన్ను గురించి చెప్పుకొచ్చానని రానా తెలియజేసాడు. చాలామంది తమకు శారీరకంగా ఏదైనా సమస్య ఎదురైతే తట్టుకోలేరు. ఆ సమస్య సాల్వ్ అయ్యాక కూడా దాని గురించే ఆలోచిస్తుంటారని, తనకు కార్నియా ట్రాన్స్ ప్లాంటేషన్ తో పాటు, కిడ్నీ మార్పిడి జరిగిందని అన్నాడు.
గతంలో సమంత హోస్ట్ చేసిన షోకి హాజరైన రానా, తనకున్న బీపీ సమస్య వల్ల గుండె దగ్గర రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిందని, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని, 70శాతం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, మరణానికి 30శాతం అవకాశం ఉన్న పరిస్థితులు చూసానని చెప్పుకొచ్చాడు.
రానా నాయుడు తర్వాత రానా చేతిలో సినిమాలేవీ లేవు, రానా నాయుడు సీజన్2 వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది.