Jai hanuman Movie: 'జై హనుమాన్'లో రానా..? సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటో వైరల్
దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హను-మాన్' (Hanu-Man) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించారు. ఆ చిత్రం కొనసాగింపుగా 'జై హనుమాన్' (Jai Hanuman Movie) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా, ఇటీవల దీపావళి పండుగ సమయంలో సినీ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారని ప్రకటించారు. దీని క్రమంలో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మళ్ళీ పెరిగాయి.
సోషల్ మీడియాలో వైరల్‌గా షబ్ శెట్టి, రానా ఫోటో
ప్రశాంత్ వర్మ తాజాగా మరొక సర్‌ప్రైజ్ అందించారు. ఆయన నటుడు రానా (Rana) రిషబ్ శెట్టితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోకు 'జై జై హనుమాన్' (Jai Jai Hanuman) అని క్యాప్షన్ ఇచ్చారు, ఇందులో రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (Prasanth Varma Cinematic Universe) గురించి ప్రస్తావించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రిషబ్ శెట్టి పేరు ప్రకటించడంతో 'జై హనుమాన్' పట్ల అంచనాలు పెరిగిన క్రమంలో, ఇప్పుడు రానా పేరు కూడా కలిపితె దాని అంచనాలు మరింత పెరిగాయి.
రానా పాత్ర గురించి ఇంకా స్పష్టత రాలేదు
రానా వంటి నటుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంటే, ఆయన పాత్ర కచ్చితంగా కథలో ఒక కీలక మలుపు తీసుకొచ్చే పాత్రగా ఉండబోతుందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. 'జై హనుమాన్' కథలో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట, దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాల గురించి చెప్పబోతున్నారు. ఇందులో రానా పాత్ర గురించి ఇంకా స్పష్టత రాలేదు, అందుకోసం మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది.
సర్‌ప్రైజింగ్ పాత్రలో రానా?
ఒక కీలక సన్నివేశంలో విభీషణ పాత్రధారి సముద్రఖని చెబుతున్నట్లుగా, 'అనర్థం.. రుధిర మణి విచ్ఛిన్నంతో అసుర తాండవ మహాప్రళయం మొదలైంది. మరో మహా యుద్ధం పురుడు పోసుకోనుంది. ఈ విపత్తు నుంచి మానవాళిని కాపాడటానికి నీ రాక అనివార్యం హనుమా..' అని తెలిపారు. అసుర గణానికి నాయకత్వం వహించే పాత్ర చాలా కీలకం కావడం వలన, రిషబ్ శెట్టికి దీటుగా నిలబడగల నటుడు కావాలి. అలాంటి అతి కొద్దిమంది నటుల్లో రానా ఒకరు. 'బాహుబలి'లో ప్రభాస్‌కు గట్టి పోటీ ఇచ్చిన భళ్లాలదేవుడి పాత్రతో రానాను మర్చిపోలేము. ఇక 'జై హనుమాన్'లో ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడా? లేక ఇంకే ఏమైనా సర్‌ప్రైజింగ్ పాత్రలో ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది.