Page Loader
Ramayana: రణ్‌బీర్ vs య‌శ్‌.. రంగంలోకి హాలీవుడ్ ఫైట్ మాస్టర్!
రణ్‌బీర్ vs య‌శ్‌.. రంగంలోకి హాలీవుడ్ ఫైట్ మాస్టర్!

Ramayana: రణ్‌బీర్ vs య‌శ్‌.. రంగంలోకి హాలీవుడ్ ఫైట్ మాస్టర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ' నుంచి మేకర్స్ తాజాగా ఓ సంచలన అప్‌డేట్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌లను చిత్రీకరిస్తున్నారు.

Details

 హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గై నోరిస్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్

'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్', 'ది సూసైడ్ స్క్వాడ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన 'గై నోరిస్' ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు. గై నోరిస్ ప్రత్యేకంగా భారత్‌కు వచ్చి ఈ సన్నివేశాల చిత్రీకరణను పర్యవేక్షిస్తున్నారు. రణ్‌బీర్, యష్‌ల మధ్య చోటుచేసుకునే ఈ యాక్షన్ ఘట్టాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ పేర్కొన్నారు.

Details

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో విజువల్ వండర్ 

భారతీయ పౌరాణిక గాథను ఆధునిక టెక్నాలజీతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కించేందుకు మేకర్స్ ఎక్కువగా శ్రమిస్తున్నారు. యష్ ఈ చిత్రంలో రావణుడిగా నెగటివ్ షేడ్స్‌తో కూడిన పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను పోషించడమే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌లో యష్ పవర్‌ఫుల్ మేకోవర్‌తో కనిపించి ప్రేక్షకుల ఆసక్తిని పెంచారు.

Details

హనుమాన్‌గా సన్నీ డియోల్?

ఈ భారీ చిత్రాన్ని యష్‌తో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. సినిమాలో హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ నటించనున్నట్లు సమాచారం. అలాగే లారా దత్తా, అరుణ్ గోవ్లి, రవి దూబే వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ.850 కోట్లు బడ్జెట్ రూ.850 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్‌గా రూపొందిస్తున్నారు. రామాయణ పార్ట్-1ను 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. పార్ట్-2 2027లో థియేటర్లలోకి రానుంది.

Details

మరోవైపు 'టాక్సిక్' మూవీతో యష్ బిజీ

రామాయణతో పాటు యష్ ప్రస్తుతం 'టాక్సిక్' అనే మరో సినిమాను కూడా చేస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.