రంగబలి రివ్యూ: సొంతూరు కథతో నాగశౌర్యకు హిట్టు దొరికిందా?
నాగశౌర్య, యుక్తి తరేజా హీరో హీరోయిన్లుగా కనిపించిన రంగబలి చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ: శౌర్య(నాగశౌర్య)కు తన ఊరంటే చాలా ఇష్టం. ఊరు విడిచి ఎక్కడికీ వెళ్ళడానికి ఇష్టపడడు. తండ్రికి(గోపరాజు రమణ) మాత్రం కొడుకు బాగుపడాలని ఉంటుంది. అందుకే మెడిసిన్ చదవడానికి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా) కలుస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. తమ ప్రేమ గురించి మాట్లాడటానికి సహజ తండ్రి(మురళీ శర్మ) దగ్గరికి వెళ్తాడు శౌర్య. అక్కడ తన ప్రేమకు అడ్డంకి తన ఊరిలోని రంగబలి సెంటర్ అని తెలుసుకుంటాడు. ఆ సెంటర్ కథేంటి? దానికి పరశురామ్(టామ్ షైన్ చాకో)కు సంబంధం ఏంటనేది సినిమాలో తెలుస్తుంది.
రంగబలి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్
ప్లస్ పాయింట్స్: ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను రంగబలి నవ్విస్తుంది. శౌర్య, అతని ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలు, కమెడియన్ సత్య ఉండే సీన్స్ అన్నీ హిలేరియస్ గా ఉన్నాయి. పాత్ర పరిధి మేరకు శౌర్య చాలా బాగా చేసాడు. అతని యాక్టింగ్ లో ఈజ్ కనిపించింది. యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టాడు. యుక్తి తరేజా అందంగా ఉంది. ముందే చెప్పినట్టు ఫస్టాఫ్ అందరినీ అలరిస్తుంది. మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్ లో కనిపించిన వేగం, కామెడీ సెకండాఫ్ లో ఉండదు. విలన్ పాత్రను ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దలేదు. మ్యూజిక్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫైనల్ గా చెప్పేదేంటంటే ఫస్టాఫ్ ఇచ్చినంత హైప్ సెకండాఫ్ ఇచ్చి ఉంటే సినిమా ఫలితం వేరే లెవెల్లో ఉండేది.