Loading...
Rao bahadur ott: నెల రోజుల్లోనే ఓటీటీలోకి 'రావు బహదూర్‌'.. ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందంటే?

Rao bahadur ott: నెల రోజుల్లోనే ఓటీటీలోకి 'రావు బహదూర్‌'.. ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

విభిన్న కథలు, సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'రావు బహదూర్‌'. దర్శకుడు వెంకటేశ్‌ మహా రూపొందించిన ఈ చిత్రంలో దీపా థామస్‌ కథానాయికగా నటించారు. జులై 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తన ప్రత్యేకమైన కథా నేపథ్యంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సత్యదేవ్‌ నటనకు విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 31 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

వివరాలు

'రావు బహదూర్‌' కథ ఏంటి?

1968 నుంచి 1991 మధ్యకాలాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా కథ సాగుతుంది.

రామప్ప రావు బహదూర్‌ (సత్యదేవ్‌) ఓ రాజవంశానికి చెందిన వ్యక్తి. కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ జీవిత చివరి దశలో ఉంటాడు.

వైద్యులు అతను మరికొన్ని నెలలకు మించి జీవించడం కష్టమని చెప్పినా, వారి అంచనాలను తారుమారు చేస్తూ చాలా కాలం బతుకుతుంటాడు.

అయితే శారీరక అనారోగ్యంతో పాటు అతను తీవ్రమైన మానసిక సమస్యలతో కూడా పోరాడుతుంటాడు.

ముఖ్యంగా ఒక అనుమానం అతన్ని నిరంతరం వెంటాడుతూ మానసికంగా కుంగదీస్తుంది.

వివరాలు

ఆఖరికి కథ ఎలా ముగుస్తుంది?

ఆ అనుమానానికి సమాధానం దొరికితే ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడతానని తన స్నేహితుడు, వ్యక్తిగత వైద్యుడు ఆచారి (వికాస్‌ ముప్పాల)తో మాట తీసుకుంటాడు.

ఇంతకీ రామప్పను వేధిస్తున్న ఆ అనుమానం ఏమిటి? దాని కారణంగా అతని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

అతని గతంలో దాగి ఉన్న నిజాలు ఏమిటి? రేణుక (దీపా థామస్‌)తో ప్రేమ ఎలా మొదలై పెళ్లి వరకు ఎలా చేరుకుంది?

అనంతరం ఆమెకు దూరంగా రామప్ప ఒంటరి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే 'రావు బహదూర్‌' చిత్ర కథ.

ADVERTISEMENT