NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / #RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..! 
    తదుపరి వార్తా కథనం
    #RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..! 
    రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..!

    #RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ యువహీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

    తక్కువ సమయంలోనే తనకంటూ మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. కానీ ఇటీవల కొంత కాలం విజయాల విషయంలో వెనుకబడిపోయాడు.

    వరుసగా విడుదలైన 'ది వారియర్', 'స్కంద', 'డబుల్ ఇస్మార్ట్' చిత్రాలు దారుణ అపజయాలను చవిచూశాయి.

    ఈ సందర్భంలో రామ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం, మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

    ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. రామ్ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.

    ప్రేమకథా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా రామ్ పోతినేని కోసం ఒక కొత్త మేకోవర్‌గా నిలవబోతుందని ఫిలింనగర్‌లో చర్చలు జరుగుతున్నాయి.

    వివరాలు 

    ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల

    ఇక, ఈ సినిమా సంబంధించి ఇటీవల ఒక వార్త వైరల్ అవుతోంది. రామ్ పుట్టినరోజు అయిన మే 15న, ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ వీడియోని విడుదల చేయనున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

    ఇక, ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, టైటిల్‌ను మే 15 ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రివీల్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

    ఇదే కాకుండా, ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

    అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి రేపటి వరకు వేచి చూడాల్సి ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

    Coming to celebrate a million emotions with the BIOPIC OF A FAN ❤️‍🔥#RAPO22TitleGlimpse drops on May 15th at 10.08 AM 💥#RAPO22@ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @siddnunidop @sreekar_prasad @artkolla… pic.twitter.com/Q8m2dTx4O1

    — Mythri Movie Makers (@MythriOfficial) May 14, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గ్లింప్స్
    రామ్ పోతినేని

    తాజా

    #RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..!  గ్లింప్స్
    Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం  ద్రౌపది ముర్ము
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం ఆపరేషన్‌ సిందూర్‌
    Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..  రోహిత్ శర్మ

    గ్లింప్స్

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో  తెలుగు సినిమా
    అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ గ్లింప్స్ విడుదల: టెడ్డీ బేర్ ప్రపంచంలోకి స్వాగతం  తెలుగు సినిమా
    మహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు  తెలుగు సినిమా
    భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు  సినిమా

    రామ్ పోతినేని

    బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల  టాలీవుడ్
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  సినిమా
    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు?  సినిమా
    స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు  స్కంద
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025