
Jabardasth Rashmi : డిసెంబర్ 31న పెళ్లిపై రష్మి కీలక ప్రకటన..ఆ అభిమానుల్లో ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు, తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ మేరకు డిసెంబర్ 31న రాత్రి 9.30 గంటలకు తన పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోనున్నట్లు ఆమె వెల్లడించారు.
దాదాపుగా పదిహేనేళ్లుగా తన కెరీర్‌ని కొనసాగిస్తూ వస్తున్న రష్మి, వృత్తి జీవితంలో పడి వివాహాన్ని మర్చిపోయింది.
ఇప్పటికే తాను నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతుంది. ఇంకా పెళ్లి భాజాలు ఎప్పుడు అనే ప్రశ్నలు తరచూగా ఎదురవుతూనే ఉన్నాయి. ఫలితంగా అందరికి ఒకేసారి సమాధానం చెప్పేందుకు రెడీ అవుతుంది రష్మి.
తాజాగా `రష్మి పెళ్లి పార్టీ` పేరుతో ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో తనకు ఎదురైన పెళ్లి ప్రశ్నలకు, ఆమె విసిగిపోయి పెళ్లి ప్రకటన చేసేయాలని నిర్ణయించుకుంది.
details
డిసెంబర్ 31 ఏం జరగనుందో చెప్పనున్న యాంకర్ రష్మి
ఈ క్రమంలోనే అందరూ రెడీ గా ఉండండి, డిసెంబర్ 31న ఆ విషయాన్ని చెప్పబోతున్నట్టు తెలిపింది రష్మి.
ఇదే సమయంలో సుడిగాలి సుధీర్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. నిజంగానే రష్మి అంతటి సాహసం చేస్తుందా, సుధీర్‌ని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుందా, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనే ఆలోచనల్లో కలవరానికి గురవుతున్నారు.
కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఇయర్ ఎండ్ సంబురాల్లో భాగంగా రష్మి ఈ పెళ్లి పార్టీ ఉండనుందని తెలుస్తోంది.
అయితే ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగమని,ప్రత్యేకంగా ఇయర్ ఎండ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.
మరి ఆ రోజు రష్మి ఏం చెప్పనుంది,నిజంగానే పెళ్లి వార్త చెబుతుందా లేక ప్రాంక్ చేసి వదిలేస్తుందా అనే దానికోసం ఎదురుచూడాల్సిందే.