Rashmika-Mysaa: 'లోక' రికార్డుపై రష్మిక కన్ను.. రూ.300 కోట్ల వసూళ్లే లక్ష్యంగా 'మైసా'!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ సినిమా చరిత్రలో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన మూవీ 'లోక: చాప్టర్ 1'. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. దక్షిణాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు పలువురు స్టార్ హీరోయిన్లు ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'మైసా'తో ఈ రికార్డుపై కన్నేసింది.
వివరాలు
'లోక'ను దాటలేకపోయిన సమంత, నయనతార
ఈ ఏడాది ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలని సమంత, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు ప్రయత్నించారు.
సమంత నటించిన 'మా ఇంటి బంగారం' మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. మహిళా ప్రధాన పాత్రలో వచ్చిన అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా రూ.100 కోట్ల మార్కును అందుకున్నప్పటికీ.. 'లోక' సాధించిన రూ.300 కోట్లకు పైగా వసూళ్లను చేరుకోవడానికి ఇంకా చాలా దూరంలో నిలిచింది.
మరోవైపు నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్ 2' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల పరంగా పూర్తిగా నిరాశపరిచింది.
వివరాలు
రికార్డుల వేటలో కీర్తి, రష్మిక
ఇప్పుడు ఈ రికార్డుల వేటలో కీర్తి సురేశ్, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. కీర్తి నటించిన 'సత్యవాన్ సావిత్రి' నవంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దీంతో 'లోక' రికార్డును అందుకోవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మైసా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఆమె ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతార్‌లో ప్రేక్షకులను అలరించనుంది.
గోండు గిరిజన యువతి పాత్రలో కనిపించబోతున్న రష్మిక.. ఈ చిత్రం కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడింది.
పాత్రకు తగ్గట్టుగా ప్రత్యేకంగా సిద్ధమవడంతో పాటు.. యాక్షన్ సన్నివేశాల్లోనూ సాహసం చేసింది.