Rashmika: విజయ్ దేవరకొండను పెళ్లి చేసకుంటా.. క్లారిటీ ఇచ్చేసిన రష్మిక!
ఈ వార్తాకథనం ఏంటి
నటి రష్మిక మందన్న తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తాజాగా వెల్లడించారు. వరుస సినిమాలతో బిజీగా ఉండటం, అలాగే విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం వార్తలతో గత కొన్ని రోజులుగా రష్మిక సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 'మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?' అని ఒక అభిమాని అడగ్గా రష్మిక చిరునవ్వుతో స్పందించారు. 'ప్రపంచం అంతా నా వ్యతిరేకంగా ఉన్నా కూడా నా కోసం నిలబడే వ్యక్తి కావాలన్నారు.
Details
నా యుద్ధం చేయగల మనిషి కావాలి
నన్ను లోతుగా అర్థం చేసుకునే మనిషి, నా దృష్టికోణం నుంచి విషయాలను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగల వ్యక్తి కావాలి. మంచి మనసున్న వ్యక్తి, నా కోసం యుద్ధం చేయగల మనిషి కావాలి. అలాంటి వ్యక్తి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే యుద్ధంలో తూటాకైనా ఎదుర్కొంటానని రష్మిక అన్నారు. ఇక మరో అభిమాని 'మీరు డేట్ చేస్తే ఎవరితో చేస్తారు? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారని అడగ్గా రష్మిక నవ్వుతూ 'డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో చేస్తా, ఎందుకంటే అతని పాత్ర నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే విజయ్‌తో చేసుకుంటానని స్పష్టంగా చెప్పారు.
Details
గత నెలలో రష్మిక, విజయ్‌ల నిశ్చితార్థం
ఈ సమాధానం వినగానే ఆడియన్స్ అందరూ కంగ్రాట్స్ అంటూ హర్షధ్వానాలు చేశారు. రష్మిక వారందరికీ థాంక్స్ చెప్పింది. గత అక్టోబర్ 3న రష్మిక, విజయ్‌ల నిశ్చితార్థం జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, రష్మిక ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పరోక్షంగా స్పందిస్తూ "నా ఎంగేజ్‌మెంట్ విషయమై మీరు అనుకుంటున్నదే నిజం. సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆమె విజయ్‌తో పెళ్లి వార్తలపై మరింత స్పష్టతనిచ్చినట్టే అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.