NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ట్రోలింగ్ వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్న రష్మిక మందన్న
    తదుపరి వార్తా కథనం
    ట్రోలింగ్ వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్న రష్మిక మందన్న
    సోషల్ మీడియా టోల్స్ పై స్పందించిన రష్మిక మందన్న

    ట్రోలింగ్ వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్న రష్మిక మందన్న

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 24, 2023
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరోయిన్ రష్మికపై సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది. అప్పుడెప్పుడో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పటి నుండి మొదలైన ట్రోలింగ్ ఇప్పటికీ ఏదో ఒక విషయంలో నడుస్తూనే ఉంది.

    కాంతారా సినిమాపై మాట్లాడినపుడు, బాలీవుడ్ సినిమాల్లో రొమాంటిక్ పాటలు బాగుంటాయని చెప్పినపుడు రష్మికను విపరీతంగా ట్రోల్ చేసారు. రష్మికను కన్నడ సినిమాల్లోకి తీసుకోవద్దని, బ్యాన్ చేయాలని కూడా అన్నారు.

    ఈ వరుస ట్రోలింగ్స్ వల్ల తాను ఇబ్బంది పడుతున్నానని తాజాగా ఒకానొక ఇంటర్వ్యూలో వెల్లడి చేసింది రష్మిక.

    తనను విమర్శించేవాళ్ళు సరిగ్గా విమర్శిస్తే, వాటిని తీసుకునే అలవాటు తనకు ఉందని, అంతేకానీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, అసభ్యంగా మాట్లాడితే ఎలా భరించాలని ఆమె అంది.

    రష్మిక

    అసభ్య వ్యాఖ్యల వల్ల మానసికంగా కుంగిపోతున్న రష్మిక

    సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ అన్నీ తనను మానసికంగా ఇబ్బంది పెట్టేలా ఉంటున్నాయని, దానివల్ల మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నట్లు రష్మిక చెప్పింది.

    ట్రోల్ చేసే వాళ్ళకు తన బాడీతో సమస్య ఉందని, సినిమాకి ఎంత వర్క్ చేస్తాం అనేది వాళ్ళు పట్టించుకోరని అంది.

    ఇంకా, ఒకవేళ తను ఎక్కువగా మాట్లాడితే అవసరం లేని వాదనలు చేస్తుందని, అదే అసలే మాట్లాడకపోతే ఆటిట్యూడ్ చూపిస్తుందని అంటారని రష్మిక వెల్లడి చేసింది.

    ట్రోల్ చేసే వాళ్ళు ఏ విషయంలో ట్రోల్ చేస్తున్నారో స్పష్టంగా ఉండాలని, ఆ ట్రోల్స్ నిజంగా సరైనవే అయితే తన బిహేవియర్ మార్చుకోవడానికి సిద్ధమని, అంతేకానీ అనవసరంగా అసభ్య పదజాలంతో దూషిస్తే మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నానని చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్

    తెలుగు సినిమా

    ఇంటివాడు కాబోతున్న హీరో శర్వానంద్, ఎంగేజ్ మెంట్ ఎప్పుడంటే టాలీవుడ్
    యూఎస్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో టాప్ లో వీరసింహారెడ్డి టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఒకరోజు ముందే ట్రైలర్ రిలీజ్ చిరంజీవి
    రవితేజ ఖాతాలో వంద కోట్ల సినిమా, ధమాకా మామూలుగా పేలలేదుగా సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025