Mysaa: గోండు గిరిజన మహిళగా రష్మిక మందన్నా.. 'మైసా'తో కొత్త ప్రయోగం!
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మైసా' (Mysaa) షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు, అప్డేట్లు ఇప్పటికే నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా కేరళలోని అథిరప్పిల్లీ వద్ద ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని ఫిలింనగర్ వర్గాల సమాచారం వెల్లడించింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా గోండు గిరిజన మహిళగా నటిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే విడుదలైన రష్మిక ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మేకోవర్ పూర్తిగా భిన్నంగా ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో రష్మిక కనిపించబోతోందని ఆ పోస్టర్ సూచిస్తోంది.
Details
రష్మిక అగ్రెసివ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్
'మైసా' సినిమాతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఆయన రష్మిక అగ్రెసివ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 'పుష్ప' ఫ్రాంచైజీలో శ్రీవల్లిగా డీగ్లామరస్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక, ఇప్పుడు గోండు మహిళగా ఎలా మెప్పిస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఈ సినిమాలో 'పుష్ప 2' విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నాడు. రష్మికతో ఆయన కలిసి నటించడం ఇది రెండోసారి కావడం విశేషం. రష్మిక కెరీర్‌లో భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'మైసా' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.