Rashmika Mandanna: వంద కాదు వెయ్యిసార్లైనా అడుగుతా...రష్మిక కౌంటర్ ఎటాక్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోవాలని వందసార్లు అడిగానని చెప్పిన మాటలపై తనను విమర్శిస్తున్న వారికి నటి రష్మిక మందన్న గట్టిగా సమాధానమిచ్చింది. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు తనకు ఉందని, విజయ్‌ను మరో వెయ్యిసార్లైనా ఎంచుకుంటానని స్పష్టం చేసింది. తమ బంధం గురించి బయటివారు చేసే వ్యాఖ్యల కంటే, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధమే తనకు ముఖ్యమని ఆమె చెప్పింది.
Details
కాఫీ విత్ కరణ్ 9లో రష్మిక
ఇటీవల 'కాఫీ విత్ కరణ్-9' కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో రష్మిక, విజయ్ తమ పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం.
విజయ్‌ను పెళ్లి చేసుకుందామని దాదాపు ఏడాది పాటు అడిగానని, సుమారు వందసార్లు చెప్పిన తర్వాత ఆయన అంగీకరించారని రష్మిక వెల్లడించిన విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని, విజయ్ ఆమెను తక్కువ చేశారంటూ విమర్శలు చేశారు. దీంతో రష్మిక తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పందించింది.
Details
ప్రేమంటే అది కాదు
పెళ్లి ప్రపోజల్ చేయడం, ఉంగరం తొడగడం మాత్రమే ప్రేమకు గుర్తులు కావని రష్మిక అభిప్రాయపడింది.
ఇద్దరూ కలిసి జీవితాన్ని నిర్మించుకోవడం, కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే అసలైన బంధమని వివరించింది.
తాను భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుంటే, విజయ్ అన్ని కోణాల్లో ఆలోచిస్తారని చెప్పింది. తమ ఇద్దరి స్వభావాల్లోని ఈ తేడానే బంధాన్ని మరింత బలపరుస్తుందని తెలిపింది.
తనకు ఆరోగ్యం బాగోలేని సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినా, ఆందోళనతో నిద్రలేచినా విజయ్ తన పక్కనే ఉన్నారని రష్మిక గుర్తుచేసుకుంది.
గతంలో తాను కష్టాలను ఎదుర్కొన్నప్పుడు విమర్శలు చేసినవారు అండగా నిలవలేదని, విజయ్ మాత్రం తనకు తోడుగా ఉన్నారని పేర్కొంది.
Details
అది పద్దతి కాదంటూ చురకలు
తనను విమర్శించే స్వేచ్ఛ ఇతరులకు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల గురించి తెలియకుండా మాట్లాడటం సరికాదని రష్మిక స్పష్టం చేసింది. స్త్రీవాదం అంటే ఇతరులను కించపరచడం కాదని, మహిళలు తమ జీవితాలపై తామే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండటమని పేర్కొంది.
విజయ్‌ను తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పడం ద్వారా విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది.