యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యానిమల్. రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి రష్మిక మందన్న లుక్ రిలీజైంది. మెరూన్ కలర్ చీరలో అచ్చ తెలుగు అమ్మాయిలా రష్మిక కనిపిస్తున్నారు. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక కనిపించనుందని దర్శకుడు తెలియజేసాడు. యానిమల్ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 28వ తేదీణ ఉదయం 10గంటలకు విడుదల చేస్తామని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.