Rashmika : 'ది గర్ల్ ఫ్రెండ్' విజయోత్సవంలో రష్మిక క్లారిటీ.. పీరియడ్స్ వ్యాఖ్యపై స్పష్టత!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల రష్మిక మందన్న ఒక వివాదాస్పద వ్యాఖ్య కారణంగా తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. "ఆడవాళ్లలాగే మగవారికీ పీరియడ్స్ వస్తే, ఆ బాధ ఎంత ఉంటుందో వాళ్లకూ అర్థం అవుతుంది" అనే ఆమె వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఈ మాటలపై చాలా మంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మగవాళ్లు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు, కుటుంబాన్ని నడిపించేది వాళ్లే"అంటూ కొందరు రష్మికపై విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలలో మగవారిని తక్కువ చేసి చూపినట్టుగా భావించి ట్రోల్స్ మరింత తీవ్రంగా కొనసాగాయి. ఈ ట్రోల్స్‌పై తాజాగా రష్మిక స్పందించింది. ఆమె నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ మంచి విజయాన్ని సాధించింది, కలెక్షన్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.
వివరాలు
ది గర్ల్ ఫ్రెండ్ వరుస ప్రమోషన్లలో రష్మిక బిజీ
ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.."అందుకే నాకు ఇంటర్వ్యూలకు పెద్దగా రావడం ఇష్టం ఉండదు.ఇంటర్వ్యూలో ఏదో ఒక ప్రశ్న అడుగుతారు, నేను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో నా మీద ట్రోల్స్ చేస్తారు.మగవారికి పీరియడ్స్ రావాలన్న నా ఉద్దేశం వేరే,కానీ వారు దానిని పూర్తిగా తారుమారు చేసుకున్నారు.నా వ్యాఖ్యల్లోఎలాంటి దురుద్దేశం లేదు.ఈ అనుభవాల వల్లే ఇక ఇంటర్వ్యూలకు రావాలంటే భయం వేస్తోంది,"అని చెప్పింది. ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. ఇక రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ వరుస ప్రమోషన్లలో రష్మిక చాలా బిజీగా ఉంటుంది.