LOADING...
Rashmika Mandanna: రష్మిక కొత్త సినిమా 'గర్లఫ్రెండ్'.. అంచనాలను పెంచేసిన టీజర్ 
రష్మిక కొత్త సినిమా 'గర్లఫ్రెండ్'.. అంచనాలను పెంచేసిన టీజర్

Rashmika Mandanna: రష్మిక కొత్త సినిమా 'గర్లఫ్రెండ్'.. అంచనాలను పెంచేసిన టీజర్ 

వ్రాసిన వారు Stalin
Oct 22, 2023
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. మన్మధుడు2 దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో 'ది గర్ల్‌ఫ్రెండ్‌(The Girlfriend)' మూవీలో ఆమె నటించనున్నారు. ఈ మేరకు ఆదివారం మూవీ మేకర్స్ వెల్లడించారు. టైటిల్‌తో పాటు రష్మిక పాత్రను పరిచయం చేస్తూ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమా హీరోయిన్ సెంట్రిక్‌గా ఉన్నట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. అయితే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు రానున్న రోజుల్లో చిత్ర బృందం వెల్లడించే అవకాశం ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 కొత్త సినిమాపై రష్మిక ట్వీట్