Rashmika: గోండు గిరిజన యువతిగా రష్మిక..'మైసా' చిత్రానికి బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ
ఈ వార్తాకథనం ఏంటి
నటి రష్మిక 'మైసా' సినిమాతో తనలోని యాక్షన్ ప్రతిభను ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమవుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ నాయికా ప్రధాన చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా, త్వరలో కేరళలో 16 రోజుల పాటు కొనసాగే కీలక యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం రష్మిక ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఆమె ప్రస్తుతం బ్యాంకాక్‌లో కఠినమైన స్టంట్, కాంబాట్ శిక్షణను పొందుతోంది.
వివరాలు
రోజూ 8 గంటల పాటు శిక్షణ..
రోజుకు సుమారు ఎనిమిది గంటలపాటు జరుగుతున్న ఈ శిక్షణలో అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్‌ను ఆమె నేర్చుకుంటోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ కథను విన్న వెంటనే ఈ పాత్ర కోసం తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మారాలని రష్మిక నిర్ణయించుకుందని, సహజంగా కనిపించే యాక్షన్ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కఠిన శిక్షణ తీసుకుంటోందని తెలిపారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రాలకు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని కూడా పేర్కొన్నారు. ఈ సినిమాలో రష్మిక శక్తివంతమైన గోండు గిరిజన యువతిగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.