Vijay Deverakonda-Rashmika:రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతూనే ఉండగా, తాజాగా మరోసారి ఈ రూమర్లు తెరపైకి వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోందని నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, అక్టోబర్‌లోనే వీరిద్దరి నిశ్చితార్థం గుట్టుచప్పుడు కాకుండా జరిగిందన్న టాక్ కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. రష్మిక చేతికి కనిపించిన రింగ్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
Details
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
ఇక ఇప్పుడు రాజస్థాన్‌లోని అందమైన ఉదయపూర్‌లో, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుందన్న ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందన్న గానీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. వీరిద్దరూ కలిసి సినిమాలు చేయడం, పబ్లిక్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడం, ఒకరిపై ఒకరు ప్రత్యేక శ్రద్ధ చూపించడం వంటి విషయాలు డేటింగ్ వార్తలకు బలం చేకూర్చాయి. అయినప్పటికీ, పెళ్లి విషయానికి వచ్చేసరికి ఈ జంట మౌనమే పాటిస్తోంది. గతంలో కూడా ఇలాంటి పెళ్లి తేదీలపై ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.