LOADING...
Upcoming Movies : ఈ వారం థియేటర్లలో రష్మిక vs సుధీర్ బాబు పోటీ.. ఓటీటీలో కొత్త సినిమాల సందడి
ఈ వారం థియేటర్లలో రష్మిక vs సుధీర్ బాబు పోటీ.. ఓటీటీలో కొత్త సినిమాల సందడి

Upcoming Movies : ఈ వారం థియేటర్లలో రష్మిక vs సుధీర్ బాబు పోటీ.. ఓటీటీలో కొత్త సినిమాల సందడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ తొలి వారంలో థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడనున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక సరసన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్,టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రష్మిక ప్రస్తుతం ఈమూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. అదే రోజున మరో ఆసక్తికర చిత్రం 'జటాధర' విడుదల కానుంది. సుధీర్ బాబు హీరోగా, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కె.ఆర్. భన్సాల్, ప్రేరణ అరోర సంయుక్తంగా నిర్మించారు.

Details

కీలక పాత్రలో సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్

ఇందులో బాలీవుడ్ నటీమణులు సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం నేపథ్యంగా సాగుతుంది. ఆలయ సంపద, దాని చుట్టూ తిరిగే వివాదాలు, పురాణ చరిత్రలను కథలో మిళితం చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక విష్ణు విశాల్ హీరోగా నటించిన 'ఆర్యన్' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గత నెల అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు అదే నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. అదేవిధంగా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే మరో సినిమా కూడా అదే వారంలో ప్రేక్షకులను పలకరించనుంది.

Details

ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు

అమెజాన్ ప్రైమ్ వీడియో రాబిన్ హుడ్ (వెబ్ సిరీస్) - నవంబర్ 2 నైన్ టూ నాట్ మీట్ యూ (వెబ్ సిరీస్) - నవంబర్ 3 జియో హాట్ స్టార్ బ్యాడ్ గర్ల్ - నవంబర్ 4 ది ఫాంటాస్టిక్ 4 (ఇంగ్లీష్) - నవంబర్ 5 సోనీలివ్ మహారాణి (వెబ్ సిరీస్) - నవంబర్ 7 నెట్‌ఫ్లిక్స్ ఇన్ వేవ్స్ అండ్ వార్ (హాలీవుడ్ సినిమా) నవంబర్ 3 బారాముల్లా (హిందీ చిత్రం) - నవంబర్ 7