LOADING...
Mysaa First Glimpse : రష్మిక మందన్న'మైసా' లో నెవర్ బిఫోర్ లుక్.. మరో బ్లాక్‌బస్టర్ పక్కా!

Mysaa First Glimpse : రష్మిక మందన్న'మైసా' లో నెవర్ బిఫోర్ లుక్.. మరో బ్లాక్‌బస్టర్ పక్కా!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో 'మైసా' అనే లేడి-ఆరియెంటెడ్ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌లో పరిచయం అవుతున్నారు. రవీంద్ర పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు నిర్మాతలు అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, అలాగే పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి గోపా సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా పాన్-ఇండియా భాషల్లో తెరకెక్కుతోంది. తాజాగా మేకర్స్ కొద్దిరోజుల క్రితం సినిమా గ్లిమ్స్‌ను రిలీజ్ చేశారు.

వివరాలు 

ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డను సంపలేక

గ్లిమ్స్‌లోని సన్నివేశాలు ఒకసారి చూసిన వెంటనే ప్రేక్షకులను అదృశ్యభయానికి లోతుగా తీసుకెళ్తాయి. గ్లిమ్స్ ను ఓ సారి పరిశీలిస్తే' మట్టే వణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాచలేక...గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరి మోయలేక...అగ్గే బూడిదయింది మండుతున్న నా బిడ్డను చూడలేక... ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డను సంపలేక' డైలాగ్ తో రక్తంతో తడిచి తుపాకీ చేతపట్టి శత్రువలను ఎదుర్కుంటున్న రష్మిక నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించింది. ఈ గ్లిమ్స్ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచాయి. బ్యాక్-టు-బ్యాక్ హిట్లతో దూసుకెళ్తున్న రష్మిక, 'మైసా'తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో చేర్చబోతున్నట్లే ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి మైసా గ్లిమ్స్ పై ఓ లుక్కేయండి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రక్తంతో నిండిన రష్మిక లుక్

Advertisement