రావణాసుర ట్విట్టర్ రివ్యూ: సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే
ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వచ్చిన రావణాసుర చిత్రం ఈ రోజు రిలీజైంది. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించాడు రవితేజ. రావణాసుర సినిమాను చూసిన నెటిజన్స్, సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అదేంటో చూద్దాం. కొంతమంది నెటిజన్స్ ఫస్ట్ హాఫ్ బాగుందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. అలాగే క్లైమాక్స్ అద్భుతంగా అనిపించిందని పోస్టులు పెడుతున్నారు. నటన పరంగా రవితేజ విశ్వరూపం చూపించారని, లా తెలిసిన క్రిమినల్ గా బాగా చేసారని, ఇలాంటి పాత్ర ఇదివరకెప్పుడూ చేయలేదని అన్నారు.
రావణాసుర సినిమాపై నెటిజన్ల రియాక్షన్
నెగెటివ్ గానూ స్పందిస్తున్న నెటిజన్లు
సెకండాఫ్ లో రవితేజ నటన పీక్స్ లో ఉందని అంటున్నారు. రవితేజ పాత్రపై ప్రశంసలు కురిపిస్తున్నారు కానీ హీరోయిన్ల పాత్రపై పెద్దగా మాట్లాడట్లేదు. ఒకానొక నెటిజన్, హీరోయిన్ల పాత్రలు సరిగ్గా లేవని అన్నాడు. రావణాసుర చిత్రంపై నెగెటివ్ గా చెబుతున్న వాళ్ళు కూడా కనిపించారు. ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తావ్ అన్న అంటూ రవితేజను ఉద్దేశించి, సినిమా అంతగా ఎంటర్ టైన్ చేయలేదని అన్నారు. ఎక్కువశాతం నెగెటివ్ కామెంట్లు కనబడలేదు. దాదాపు చాలామంది రావణాసుర చిత్రంపై పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ట్విస్టులు బాగున్నాయని చెప్పిన నెటిజన్లు, సినిమాను సరిగ్గా డీల్ చేయలేదని అంటున్నారు. ట్విట్టర్ లో మిశ్రమ స్పందన కనిపిస్తుంది కాబట్టి, రెండు మూడు రోజులు ఆగితే సినిమా ఫలితం ఏంటనేది అర్థమవుతుంది.