Suriya 46: సూర్య మూవీలో రవీనా టాండన్ కీలక పాత్ర.. సౌత్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ స్ట్రైట్ సినిమా చేస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రం(తెలుగు-తమిళం)ప్రస్తుతం 'Suriya 46' అనే వర్కింగ్ టైటిల్‌తో నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ మరో ఆసక్తికరమైన వార్తను బయటకు తెచ్చింది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమె పుట్టినరోజు(అక్టోబర్ 26)సందర్భంగా సినిమా యూనిట్ రవీనాకు బర్త్‌డే విషెస్ చెబుతూ, ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. మీరు మా ప్రయాణంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.
Details
కథానాయికగా మమితా బైజు
రాబోయే అద్భుతమైన జర్నీ కోసం ఎదురుచూస్తున్నామంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'సూర్య 46'లో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు రవీనా టాండన్ కూడా జాయిన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది. ఆమె పాత్ర చుట్టూ ఇప్పటికే ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించే దర్శకుడిగా వెంకీ అట్లూరి మంచి గుర్తింపు పొందారు. 'తొలి ప్రేమ', 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించారు.
Details
దశాబ్దం తర్వాత రీ ఎంట్రీ
ఇప్పుడు వర్సటైల్ నటుడు సూర్యతో కలిసి చేస్తున్నందున ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రవీనా టాండన్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె గతంలో నందమూరి బాలకృష్ణతో 'బంగారు బుల్లోడు', అక్కినేని నాగార్జునతో 'ఆకాశవీధిలో' సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. 2014లో మోహన్ బాబుతో 'పాండవులు పాండవులు తుమ్మెద'లో కనిపించారు. తాజాగా 'కేజీఎఫ్ 2'లో రమికా సేన్ పాత్రతో దేశవ్యాప్తంగా మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత రవీనా టాండన్ ఇప్పుడు 'సూర్య 46' ద్వారా టాలీవుడ్‌కు గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నారు.