Tollywood: టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న రవీనా టాండన్ తనయ.. ఘట్టమనేని వారసుడితో లవ్ స్టోరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఘట్టమనేని కుటుంబానికి చెందిన మరో యువ హీరోగా ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కృష్ణ మనవడు, రమేశ్‌బాబు కుమారుడైన జయకృష్ణను హీరోగా తీసుకుని దర్శకుడు అజయ్ భూపతి ఓ ప్రత్యేక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ సమర్పణలో పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే నటి రవీనా టాండన్ - ఏఏ ఫిల్మ్స్ ఇండియా అధినేత అనిల్ థడానీల కుమార్తె రషా థడానీ టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. జయకృష్ణ సరసన రషా కథానాయికగా కనిపించనుందని తెలిపే పోస్టర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం
రషా ఇప్పటికే 'అజాద్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త చిత్రంతో ఆమె తెలుగు తెరపైకి రానుంది. ఈ సినిమాలో రషా బలమైన, నటనకు ప్రాధాన్యం ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే వాస్తవిక శైలిలో, గాఢమైన భావోద్వేగాలను కూడుకున్న ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.