LOADING...
Raviteja : హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఫ్యాన్స్.. కానీ 'మాస్ జాతర' ప్రమోషన్లపై నిరాశ!
హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఫ్యాన్స్.. కానీ 'మాస్ జాతర' ప్రమోషన్లపై నిరాశ!

Raviteja : హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఫ్యాన్స్.. కానీ 'మాస్ జాతర' ప్రమోషన్లపై నిరాశ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజ రవితేజ కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నారు. క్రాక్ సినిమా తర్వాత ఆయన భారీ హిట్ ఇవ్వలేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రవితేజ 'మాస్ జాతర' అనే కొత్త సినిమా కోసం రాబోతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్యాన్స్ మాస్ మహారాజా దాదాపు లాంగ్‌టైమ్ తర్వాత కంబ్యాక్ చేస్తాడనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ద్వారా 'మాస్ జాతర' ఒక పూర్తి కమర్షియల్ మాస్ సినిమా అని స్పష్టమవుతోంది. ఇందులో రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో రవితేజ నేరుగా పాల్గొనడంలేదు.

Details

25 రోజులు స్పెయిన్ లో షూటింగ్

రవితేజ వరుస ఫ్లాప్స్ నేపథ్యంలో ఇలాంటి టైంలో జనాల్లోకి రావడం, ప్రమోషన్స్ చేయడం వద్దని నిర్ణయించారట. అక్టోబర్ 31న బాహుబలి రీ-రిలీజ్ కూడా ఉండటం, కాంపిటిషన్ ఎక్కువగా ఉండటం ఈ నిర్ణయంలో భాగమని చెప్పబడుతోంది. రిలీజ్‌కు ముందు, రవితేజ 'మాస్ జాతర' ప్రమోషన్స్ కోసం ఒకే రోజు ఐదు ఇంటర్వ్యూలను షూట్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోగా, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌కి ఆయన రావడంలేదు. రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా కోసం 25 రోజుల పాటు స్పెయిన్‌లో ఉంది.

Details

ఫ్రీ-రిలీజ్ కు రవితేజ వస్తారా?

అందువల్ల రవితేజ తిరిగి వచ్చే వరకు, ఇప్పటివరకు షూట్ చేసిన ఇంటర్వ్యూలను మెల్లిమెల్లగా వదులుతున్నారు. ఫ్యాన్స్ ఇప్పుడు ఒకేచోట ఆలోచిస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఆయన వస్తారా? 25 రోజుల షూట్ షెడ్యూల్ పెద్దదే, కాబట్టి సినిమా రిలీజ్ సమయానికి అక్కడ ఉండగలరా? హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన సమయానికి రవితేజ ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న రవితేజ తర్వాత సినిమా ఫ్యామిలీ లవ్ స్టోరీగా ఉండబోతుందనే సమాచారం ఉంది.