తదుపరి వార్తా కథనం
Ravi Teja: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రిలీజ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 19, 2025
05:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అంటూ రవితేజ తనదైన శైలిలో పంచ్ డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ టచ్‌తో పాటు ఒక సున్నితమైన అంశాన్ని వినోదభరితంగా ప్రస్తావించనున్నట్లు టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.