Irumudi in OTT: ఓటీటీలోకి రవితేజ 'ఇరుముడి'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 13, 2026
12:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇరుముడి' (Irumudi). ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక 'నెట్‌ఫ్లిక్స్'లో సెప్టెంబర్ 18 నుంచి 'ఇరుముడి' స్ట్రీమింగ్ కానుంది (Irumudi in OTT). తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఇందులో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించారు. రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర మెప్పించారు.
వివరాలు
బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన 'ఇరుముడి'
మద్యానికి బానిసైన ఓ తండ్రి చేసే భావోద్వేగ, ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.
ఆ తండ్రి జీవితంలో చోటుచేసుకునే భావోద్వేగ పరిణామాలు, ఆధ్యాత్మిక ప్రయాణమే 'ఇరుముడి' చిత్రానికి ప్రధానాంశంగా నిలిచాయి.