Mass jathara: యూ/ఏ సర్టిఫికేట్‌తో రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి!
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ఇప్పటికే పూర్తయి 'మాస్ జాతర' అక్టోబరు 31న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయి, యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేసింది.
Details
సినిమా నిడివి 160 నిమిషాలు
'మాస్, ఫన్ అండ్ యాక్షన్' అన్నీ ఒకే సినిమాలో కనిపించనున్నాయని, థియేటర్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మాస్ వేవ్‌ని ఆస్వాదించమని తెలిపారు. సినిమా నిడివి 160 నిమిషాలుగా ఖరారు చేశారు. అంతేకాదు, ప్రీమియర్స్ నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించిన అనుమతుల కోసం బృందం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా 'ధమాకా' తర్వాత రవితేజ - శ్రీలీల కలయికలో వచ్చిన రెండవ ప్రాజెక్ట్. రవితేజ పోలీసు అధికారి పాత్రలో సందడి చేయనున్నారు. ట్రైలర్ అక్టోబరు 27న రిలీజ్ చేయనున్నారని సమాచారం.