Mass Jathara pre release event: రవితేజ-శ్రీలీల కాంబోలో 'మాస్ జాతర'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్ ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను సృష్టించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Details
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హాజరు
అక్టోబర్ 28 (మంగళవారం) జేఆర్సీ కన్వెన్షన్స్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హాజరుకానున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. 'ధమాకా' తర్వాత రవితేజ-శ్రీలీల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. తాజా సమాచారం ప్రకారం, 'మాస్ జాతర' నిడివి 160 నిమిషాలుగా ఉండనుందని తెలుస్తోంది.