LOADING...
Ravi Teja : మళ్లీ రవితేజ-సురేందర్ రెడ్డి కాంబో.. 'కిక్ 3'తో మాస్ మహారాజా రీఎంట్రీ? 
మళ్లీ రవితేజ-సురేందర్ రెడ్డి కాంబో.. 'కిక్ 3'తో మాస్ మహారాజా రీఎంట్రీ?

Ravi Teja : మళ్లీ రవితేజ-సురేందర్ రెడ్డి కాంబో.. 'కిక్ 3'తో మాస్ మహారాజా రీఎంట్రీ? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందన్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఒకప్పుడు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'కిక్' సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. అయితే ఆ తర్వాత వచ్చిన 'కిక్ 2' మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అయినప్పటికీ ఈ హిట్ ఫ్రాంచైజ్‌ను 'కిక్ 3' రూపంలో కొనసాగించేందుకు ఈ జోడీ సిద్ధమవుతోందన్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 'ఏజెంట్' సినిమా ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి, తాజాగా రవితేజకు ఒక పవర్ఫుల్ కథను వినిపించారని సమాచారం. ఆ కథ రవితేజకు బాగా నచ్చడంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Details

 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా షూటింగ్‌లో బిజీగా రవితేజ

అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో నిర్మాత మార్పు జరగడం, అలాగే ప్రస్తుతం సురేందర్ రెడ్డి, రవితేజ ఇద్దరి మార్కెట్ కొద్దిగా తగ్గిన పరిస్థితుల్లో ఉండటం నేపథ్యంలో 'కిక్' ఫ్రాంచైజ్ క్రేజ్ ఈ సినిమాకు ఎంతవరకు కలిసి వస్తుందన్న అంశం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రస్తుతం రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే 'కిక్ 3' సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాతో తప్పకుండా గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో సురేందర్ రెడ్డి ఒక బలమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టు టాక్. ఇక అభిమానులు మాత్రం ఈ మాస్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

Advertisement