LOADING...
Ravi Teja: శ్రీవిష్ణు దర్శకుడితో మూవీ.. 'అక్కయిలూ బాగున్నారా' అంటున్న రవితేజ!
శ్రీవిష్ణు దర్శకుడితో మూవీ.. 'అక్కయిలూ బాగున్నారా' అంటున్న రవితేజ!

Ravi Teja: శ్రీవిష్ణు దర్శకుడితో మూవీ.. 'అక్కయిలూ బాగున్నారా' అంటున్న రవితేజ!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 27, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ఒకప్పుడు కనీసం హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉండేది. అయితే గత కొంతకాలంగా ఆయనకు ఆశించిన స్థాయి విజయాలు దక్కడం లేదు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత వరుసగా అనేక సినిమాలు చేసినప్పటికీ, ఒక్కటీ పూర్తిస్థాయి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. దీంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న 'ఇరుముడి' చిత్రంతో ఆయన మళ్లీ విజయపథంలోకి వస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఆయన మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అది కూడా వినోదాత్మక కథాంశంతో రూపొందనుందని తెలుస్తోంది.

వివరాలు

శ్రీ విష్ణుకు హిట్స్ అందించిన దర్శకుడితో మూవీ

ఇటీవలి కాలంలో యువ హీరోల్లో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు శ్రీ విష్ణు. ఆయనతో 'రాజ రాజ చోర', 'స్వాగ్' చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హసిత్ గోలి. అందులో 'రాజ రాజ చోర' మంచి విజయాన్ని అందుకోగా, 'స్వాగ్' సినిమా శ్రీ విష్ణు అభిమానులతో పాటు ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే హసిత్ గోలి దర్శకత్వంలో నటించేందుకు రవితేజ అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు

'అక్కాయిలూ... బాగున్నారా?' టైటిల్ ఇదేనా? 

రవితేజ హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రానికి 'అక్కాయిలూ... బాగున్నారా?' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, కథా చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, మాస్ సెంటర్లలో మంచి వసూళ్లు సాధించింది. పూర్తి స్థాయి వినోదాన్నిచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి రవితేజ కోసం హసిత్ గోలి ఎలాంటి కథను సిద్ధం చేశారో చూడాలి.

Advertisement