Page Loader
'ఈగల్' షూటింగ్ కి లండన్ వెళ్లిన రవితేజ 
'ఈగల్' షూటింగ్ కి లండన్ వెళ్లిన రవితేజ

'ఈగల్' షూటింగ్ కి లండన్ వెళ్లిన రవితేజ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2023
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తూనే, మరో వైపు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఈగల్' చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈగల్ సినిమాకి సంబంధించి ఇంకా కొంత ప్యాచ్ వర్క్ మిగిలిపోవడంతో సినిమా యూనిట్ రెండు రోజుల క్రితం లండన్ వెళ్లారు. ఈ ప్యాచ్ వర్క్ కోసం ఇవాళ రవితేజ లండన్ వెళ్లారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల అవనుంది. 'ఈగల్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇక, వచ్చే నెల నుంచి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణకు రవితేజ హాజరుకానున్నారని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ ఈ రెండు సినిమాల కోసం మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈగిల్ కోసం లండన్ వెళుతున్న రవితేజ