
సర్వం శక్తిమయం: అష్టాదశ శక్తి పీఠాల దర్శనమే ప్రధానాంశంగా రూపొందిన సిరీస్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా నుండి సర్వం శక్తిమయం అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది.
అష్టాదశ శక్తి పీఠాల గురించి తెలియజేసే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేశారు.
సతీదేవి మృతదేహాన్ని మహాశివుడు కోపంతో మోస్తూ తాండవం చేస్తుండగా అమ్మవారి శరీరం ముక్కలు ముక్కలుగా మారి కొన్ని ప్రాంతాల్లో పడ్డాయి.
ఆ ప్రాంతాలనే శక్తి పీఠాలు అంటారని ట్రైలర్ మొదట్లో చెప్పుకొచ్చారు. దేవుడిని నమ్మని నాస్తికుడు శక్తి పీఠాలను ఎందుకు దర్శించుకున్నాడనేది ఆసక్తికరమైన పాయింట్ గా ట్రైలర్ లో కనిపిస్తోంది.
సంజయ్ సూరి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రైలర్ విడుదలపై ఆహా ట్వీట్
పనే దైవంగా పనిచేసుకుంటూ పోయే..👍🙏
— ahavideoin (@ahavideoIN) October 18, 2023
మన మాస్ మహారాజా రవితేజ గారు రిలీజ్ చేసిన 'సర్వం శక్తిమయం' ట్రైలర్!
Watch #SarvamShakthiMayamOnAha 🙏🏻 Premiers Oct 20@RaviTeja_offl #SarvamShakthiMayam #TigerNageswaraRao @sanjaysuri @samirsoni123 @ashleshaat @actorsubbaraju @BvsRavi… pic.twitter.com/3iIGIxGpWl