
రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర చిత్రం, ఏప్రిల్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
2నిమిషాల ట్రైలర్ లో ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. టీజర్ లో కనిపించిన కన్ఫ్యూజన్ లు ఇందులో కనిపించలేదు. చాలా స్పష్టంగా రవితేజ పాత్రలోని నెగెటివ్ షేడ్స్ చూపించారు.
ట్రైలర్ ఫస్ట్ హాఫ్ అంతా రవితేజకు సరిపోయే కామెడీ అంశాలతో నిండి ఉంది. పక్కన హైపర్ ఆది కూడా ఉన్నాడు కాబట్టి నవ్వుకోవడానికి పుష్కలమైన సీన్లు ఉన్నాయని అర్థమవుతోంది.
ఇక సెకండాఫ్ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా కనిపించాయి. దీన్నిబట్టి రవితేజలోని రావణాసుర యాంగిల్, సెకండాఫ్ నుండి ఉంటుందని అనుకోవచ్చు.
రావణాసుర
ట్రైలర్ లో పేలిన పవర్ ఫుల్ డైలాగ్స్
ట్రైలర్ సెకండ్ హాఫ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ కనిపించాయి. వాడు క్రిమినల్ లాయర్ కాదు, లా తెలిసిన క్రిమినల్, మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్ వంటి డైలాగులు భలేగా పేలాయి.
ట్రైలర్ చివర్లో వినిపించిన మరో డైలాగ్, సినిమాలో రవితేజ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలియజేస్తుంది.
హీరోయిన్లలో ఫారియా అబ్దుల్లా, లాయర్ గా కనిపించింది. అను ఇమ్మాన్యుయేల్ ఒక షాట్ లో కనిపించింది. విలన్ గా సుశాంత్ కూడా ఒకే ఒక్క షాట్ లో కనిపించాడు.
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంయుక్తంగా సంగీతాన్ని అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రావణాసుర ట్రైలర్ విడుదల
We’re all bad in someone's story!
— Ravi Teja (@RaviTeja_offl) March 28, 2023
Presenting you all the #RavanasuraTrailer 🔥
- https://t.co/zfsnw1anr3
Taking over theatres from APRIL 7th :))
#RavanasuraOnApril7 pic.twitter.com/DfpEyJVI28