మానాడు రీమేక్: వరుణ్ ధావన్ తో కలిసి నటించేందుకు రవితేజ రెడీ?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్, బాలీవుడ్ అనే గేట్లను ఎత్తేసి పాన్ ఇండియాను సృష్టించిన తెలుగు సినిమా నుండి వరుసగా పాన్ ఇండియా హీరోలు వస్తూనే ఉన్నారు. బాహుబలి వరకు ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియా హీరో.
ఇప్పుడు దాదాపుగా అందరూ పాన్ ఇండియా అంటున్నారు. తాజాగా రవితేజ కూడా పాన్ ఇండియా బ్యాచ్ లో చేరిపోతున్నట్టుగా కనిపిస్తోంది.
మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రవితేజ సిద్ధం అవుతున్నాడని వినిపిస్తోంది. అది కూడా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
2021లో తమిళంలో రిలీజైన మానాడు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇందులో హీరో రవితేజ కూడా నటించబోతున్నారని అంటున్నారు.
రవితేజ
టైమ్ లూప్ లో ఇరుక్కుపోయిన పాత్రల కథ
అయితే ఈ సినిమాలో మరో హీరోగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటిస్తాడని అనేక వార్తలు వస్తున్నాయి. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
అందుకే రవితేజను తీసుకోవాలని అనుకుంటున్నారట. రవితేజ కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు.
టైమ్ లూప్ లో ఇరుక్కుపోయిన ఒక పోలీస్ ఆఫీసర్, ఒక బిజినెస్ మేన్ ల కథను మానాడు చిత్రంలో చూపించారు. ఇందులో సిలంబరసన్, ఎస్ జే సూర్య హీరోలుగా కనిపించారు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షలు వచ్చాయి.