Page Loader
Razakar: ఓటిటిలోకి రజాకార్ సినిమా.. ఎప్పుడంటే?
ఓటిటిలోకి రజాకార్ సినిమా.. ఎప్పుడంటే?

Razakar: ఓటిటిలోకి రజాకార్ సినిమా.. ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా 'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' ను యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది మార్చిలో థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తారు సక్సెస్ సాధించింది. రాజాకార్ల పాలనలో జరిగిన అహంకారాన్ని తెరపై ప్రతిబింబించిన ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలకు గురైంది. కోర్టులో విడుదల వాయిదా వేయాలని కొన్ని కేసులు కూడా లేవనెత్తారు.

Details

జనవరి 24న స్ట్రీమింగ్

అయినా సినిమా థియేటర్స్‌లో విడుదల అయి పది నెలలు గడిచినా, ఓటిటిలో మాత్రం విడుదల కాలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. 'రజాకార్' ఓటిటి హక్కులను ప్రముఖ తెలుగు ప్లాట్‌ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. జనవరి 24 నుంచి ఈ సినిమా ఆహా స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ పొందుతుందని ఆహా అంచనా వేస్తోంది. టాలీవుడ్‌లో సెన్సేషన్ అయిన భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రానికి గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.