Page Loader
Ram Charan: "ఆర్‌సీ 16" లుక్.. చిట్టిబాబును మించేలా రామ్ చరణ్‌ లుక్!
"ఆర్‌సీ 16" లుక్.. చిట్టిబాబును మించేలా రామ్ చరణ్‌ లుక్!

Ram Charan: "ఆర్‌సీ 16" లుక్.. చిట్టిబాబును మించేలా రామ్ చరణ్‌ లుక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన ఆర్‌సీ 16 షూటింగ్‌లో భాగంగా మైసూర్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఉత్తరాంధ్రలోని విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది, ఇందులో చరణ్ రగ్గడ్ గడ్డంతో ఊరమాస్‌గా దర్శనమిచ్చే అవకాశం ఉంది. ఈ లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ డిజైన్ చేశారు. ఇంకా ఈ ప్రీ లుక్‌తో చరణ్ మాస్ పర్సనాలిటీని చూపించనున్నాడు.

Details

హీరోయిన్ గా జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.