Prabhas: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు 2 కోట్లు సాయం ప్రకటించిన ప్రభాస్
తెలుగు రాష్ట్రాల్లో వరదలు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరదల ప్రభావంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. సినీ రంగం కూడా వరద బాధితుల సహాయం కోసం ముందుకొచ్చింది. స్టార్ హీరోలు,నిర్మాతలు భారీ విరాళాలను ప్రకటించారు.
ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు రూ. 2 కోట్లు
'అయ్' మూవీ యూనిట్,'కల్కి' నిర్మాతలు అశ్విని దత్త (రూ. 25 లక్షలు),ఎన్టీఆర్ (తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 1 కోటి),విశ్వక్ సేన్ (రూ. 10 లక్షలు),సిద్ధూ జొన్నలగడ్డ(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 30 లక్షలు),సూపర్ స్టార్ మహేష్ బాబు(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 1 కోటి),బాలకృష్ణ (రూ. 1 కోటి),పవన్ కళ్యాణ్ (రూ. 1 కోటి),నటి అనన్య నాగళ్ళ(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 5 లక్షలు) విరాళాలు అందించారు. తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వరద బాధితుల సహాయానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 2 కోట్లు అందించారు.అలాగే, వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు,తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
శాంతిస్తున్న కృష్ణా నది
ఆయన చేసిన ఈ విరాళంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా భారీ వరదలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కృష్ణా నదీ ప్రవాహం ఇప్పుడు నెమ్మదిగా శాంతిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు నీటిమట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని 11.47 లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడింది. అయితే, ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గింది.