Page Loader
Prabhas : ప్రభాస్ 'స్పిరిట్' కు ముహూర్తం ఫిక్స్ 
ప్రభాస్ 'స్పిరిట్' కు ముహూర్తం ఫిక్స్

Prabhas : ప్రభాస్ 'స్పిరిట్' కు ముహూర్తం ఫిక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమాలు ఒక స్థాయిలో ఉంటే,ప్రభాస్ హీరోగా వస్తోన్న స్పిరిట్ మరో స్థాయిలో ఉంటుందని అంటున్నారు. చెప్పాలంటే, అనిమల్ చిత్రంలో సందీప్ చూపించిన హింస(వైలెన్స్)కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పైగా, ఆయన డ్యూయల్ రోల్‌లో నటిస్తారని టాక్ ఉంది. ప్రభాస్ పాత్ర పూర్తిగా విభిన్నంగా, హై వోల్టేజ్ యాక్షన్‌తో ఉండబోతుందని సమాచారం. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కోణంలో ప్రభాస్‌ను సందీప్ రెడ్డి చూపించబోతున్నాడు. అందుకే,స్పిరిట్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నాడు.

వివరాలు 

మార్చి నెలలో  లాంఛనంగా ప్రారంభం 

అయితే,ఈ సినిమా షూటింగ్ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.అసలైన విషయానికి వస్తే, స్పిరిట్ గతేడాది చివర్లోనే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది.తాజా సమాచారం ప్రకారం,రాబోయే మార్చి నెలలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత వేసవి కాలంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.ఇటీవల ప్రభాస్ లుక్ టెస్ట్ కోసం సందీప్ రెడ్డి డిస్కషన్ చేసినట్లు సమాచారం. అతి త్వరలోనే ప్రభాస్ టెస్ట్ కట్ ఉండబోతోందట.మొదటి షెడ్యూల్‌ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నారని,సందీప్ ఇప్పటికే అక్కడ లొకేషన్ రెక్కీ కూడా చేసినట్టు టాక్. అక్కడ కొన్ని పోలీస్ సీన్స్ చిత్రీకరించనున్నారు.త్వరలోనే చిత్రీకరణ అప్డేట్‌తో పాటు స్టార్ క్యాస్టింగ్‌కి సంబంధించిన వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.