
NTR: ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్‌కి రికార్డు ధర.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా స్థాయి సినిమాలతో రాణిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన 'వార్ 2'లో నటించి సందడి చేశారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అభిమానులను మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి 'డ్రాగన్' అనే భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ప్రతి సారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేస్తున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతోంది.
Details
రూ.1.45 లక్షలు చెల్లించిన అమెరికా అభిమాని
కానీ ఈసారి కారణం సినిమా కాదు... ఒక అద్భుతమైన స్కెచ్ ఆర్ట్! తెలుగు యువ కళాకారిణి బ్యులా రూబీ తన పెన్సిల్ ఆర్ట్‌లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందుతోంది. సినిమా సెలబ్రిటీలను, స్టార్ హీరోలను స్కెచ్ రూపంలో ఆవిష్కరించి వాటిని సోషల్ మీడియాలో పంచుతూ, అమ్మకానికి ఉంచుతోంది. తాజాగా ఆమె వేసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ నెట్టింట్లో దుమ్మురేపుతోంది. ఈ ఆర్ట్‌ను చూసిన ఓ ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుంచి బ్యులా రూబీని సంప్రదించి, ఆ స్కెచ్‌ను కొనాలనుకున్నాడు. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది.
Details
స్కెచ్ అదిరింది అంటూ కామెంట్లు
ఆమె తెలిపిన వివరాల ప్రకారం 'నేను గీసిన తెలుగు హీరోల స్కెచ్‌లలో ఇది అత్యధిక ధరకు అమ్ముడైనది. ఓ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను సంప్రదించి, ఈ ఆర్ట్‌ను 1650 డాలర్లకు (దాదాపు ₹1.45 లక్షలు) కొనుగోలు చేశారని చెప్పింది. ఇది నేను ఊహించలేదు. నా ఆర్ట్ ఇంత విలువ పొందుతుందని అనుకోలేదని తెలిపింది. ప్రస్తుతం ఈ స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఎన్టీఆర్ అభిమానులు బ్యులా రూబీ ప్రతిభను ప్రశంసిస్తూ 'స్కెచ్ అదిరింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.