Loading...
Rayavalasa : కార్తిక్‌ జయంతి 'రాయవలస' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?
కార్తిక్‌ జయంతి 'రాయవలస' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

Rayavalasa : కార్తిక్‌ జయంతి 'రాయవలస' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్తిక్‌ జయంతి హీరోగా పరిచయం అవుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయవలస'. రాధిక జయంతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. RaysuN ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై గోపీ కృష్ణ జె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'రాయవలస' నుంచి విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 'రాయవలస' సినిమాను నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో కార్తిక్‌ జయంతి సినీ ఎంట్రీకి డేట్‌ ఖరారైంది. ఈ చిత్రంలో శ్రీష నులు కథానాయికగా నటిస్తున్నారు.

వివరాలు

నవంబర్ 20న రిలీజ్

అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్‌, రవి వర్మ, కాశీ విశ్వనాథ్‌, త్రినాథ్‌ రావు, సుహాస్‌, కంచరపాలెం రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అర్జున్‌ బాలా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'రాయవలస' ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని పెంచగా.. నవంబర్‌ 20న థియేటర్లలో విడుదల కానుంది.

ADVERTISEMENT