Loading...
Anumana Pakshi: 'డీజే టిల్లు' ఫేమ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. 'అనుమాన పక్షి'కి డేట్ లాక్!
'డీజే టిల్లు' ఫేమ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. 'అనుమాన పక్షి'కి డేట్ లాక్!

Anumana Pakshi: 'డీజే టిల్లు' ఫేమ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. 'అనుమాన పక్షి'కి డేట్ లాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

'డీజే టిల్లు' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు విమల్ కృష్ణ మరో డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథలో హీరోకు కలిగే అనుమానాలు, గందరగోళమే ప్రధానంగా నవ్వులు పూయించనున్నాయి. రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న 'అనుమాన పక్షి' ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఆసక్తిని పెంచగా.. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.

వివరాలు

కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధం

'డీజే టిల్లు' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు విమల్ కృష్ణ మరో డిఫరెంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈసారి ఆయన ఎంచుకున్న కథలో హీరోకు కలిగే అనుమానాలు, గందరగోళమే ప్రధానంగా నవ్వులు పూయించనున్నాయి.

రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న 'అనుమాన పక్షి' ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఆసక్తిని పెంచగా.. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.

వివరాలు

ప్రధాన పాత్రలో రాగ్ మయూర్

'అనుమాన పక్షి'కి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో 'డీజే టిల్లు'తో యూత్‌ను ఆకట్టుకున్న ఆయన.. ఈసారి కూడా సిట్యుయేషనల్ కామెడీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను అతడి విపరీతమైన ఆలోచనలు, అనుమానాలతో ముడిపెట్టి నవ్వులు పూయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రాగ్ మయూర్ కెరీర్‌లో ఈ సినిమా కీలకంగా మారనుంది.

పోస్టర్‌లో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తే.. ఈసారి మరింత కడుపుబ్బ నవ్వించే కామెడీ ఉండబోతున్నట్లు అనిపిస్తోంది.

ADVERTISEMENT