తదుపరి వార్తా కథనం
Hit 3: నాని "హిట్ 3" ట్రీట్‌కు డేట్ ఫిక్స్!
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 19, 2025
01:30 pm
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటైన సాలిడ్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ "హిట్ 3". ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
యువ దర్శకుడు శైలేష్ కొలనుతో తెరకెక్కిస్తున్నఈ ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా,సినిమా రిలీజ్‌కు ముందు టీజర్ కోసం మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం,ఈ టీజర్ ఫిబ్రవరి 24న విడుదల కానుంది అని అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నిర్మాణంలో నాని కూడా భాగంగా ఉన్నాడు.ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మే 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
𝒏𝒐𝒕 𝒇𝒐𝒓 𝒕𝒉𝒆 𝒇𝒂𝒊𝒏𝒕 𝒉𝒆’A’𝒓𝒕𝒆𝒅 ❤️🔥#Hit3 ~ Feb 24th 💣 pic.twitter.com/V5ty9BCh6s
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 19, 2025