Loading...
Malapilla Movie: 12 కేంద్రాల్లో ఒకేసారి విడుదల.. తెలుగు సినిమా చరిత్రలో 'మాలపిల్ల' సంచలనం!
12 కేంద్రాల్లో ఒకేసారి విడుదల.. తెలుగు సినిమా చరిత్రలో 'మాలపిల్ల' సంచలనం!

Malapilla Movie: 12 కేంద్రాల్లో ఒకేసారి విడుదల.. తెలుగు సినిమా చరిత్రలో 'మాలపిల్ల' సంచలనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా టాకీ యుగం 1932లో 'భక్త ప్రహ్లాద' చిత్రంతో ప్రారంభమైంది. అయితే సామాజిక సంస్కరణల పంథాలో తెలుగు సినిమా అడుగులు మాత్రం 1938 నుంచి మరింత బలంగా పడ్డాయి. సామాజిక దురాచారాలను నిర్ద్వంద్వంగా ప్రశ్నిస్తూ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన చిత్రం 'మాలపిల్ల'. 1938 సెప్టెంబర్ 25న విజయదశమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో సంచలన విజయాన్ని సాధించింది. వినోదంతో పాటు సామాజిక స్పృహను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సాధించిన అరుదైన ఘనతల్లో ఒకటి.. అప్పట్లోనే ఏకంగా 12 ప్రధాన కేంద్రాల్లో ఒకేసారి విడుదల కావడం.

వివరాలు

సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడికి నాంది

విజయవాడలోని దుర్గా కళామందిరం, తెనాలిలోని సత్యనారాయణ టాకీస్, గుంటూరులోని ఫిలిప్స్ థియేటర్, బందరులోని బృందావన టాకీస్, ఏలూరులోని రామకృష్ణ థియేటర్

నెల్లూరులోని వినాయక టాకీస్, రాజమండ్రిలోని హనుమాన్ టాకీస్, కాకినాడలోని క్రౌన్ థియేటర్, విశాఖపట్నంలోని పూర్ణా టాకీస్, విజయనగరంలోని శ్రీకృష్ణ టాకీస్, సికింద్రాబాద్‌లోని రాజేశ్వరి థియేటర్, బెంగళూరులోని మెజిస్టిక్ థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితమైంది.

అప్పట్లోనే ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడికి నాంది పలికింది.

వివరాలు

కాంచనమాల అందానికి ప్రేక్షకులు ఫిదా.. క్యాలెండర్లకు భారీ డిమాండ్

'మాలపిల్ల' టైటిల్ రోల్‌ను ప్రముఖ నటి కాంచనమాల పోషించారు. ఆమె అందం, నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలైన తర్వాత ఆమెకు మరింత గుర్తింపు లభించింది.

చిత్ర ప్రచారం కోసం నిర్మాతలు వినూత్న పద్ధతిని అనుసరించారు. మోడరన్ లుక్‌లో కాంచనమాలతో ప్రత్యేక ఫొటోషూట్ చేయించి, ఆ ఫొటోలను క్యాలెండర్లుగా ముద్రించి విక్రయించారు.

వాటిని కొనుగోలు చేసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. అప్పటికే కాంచనమాలకు ఉన్న స్టార్‌డమ్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది.

ఈ చిత్రంలో గాలి వెంకటేశ్వరరావు హీరోగా నటించారు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు సోదరుడు కావడం విశేషం.

ADVERTISEMENT

వివరాలు

విడుదలకు ముందే వివాదం.. థియేటర్లకు పోటెత్తిన ప్రేక్షకులు

'శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి' వంటి జనరంజకమైన పాటలను అందించిన సంగీత దర్శకుడే గాలి పెంచల నరసింహారావు.

ఇక సినిమాలో కీలకమైన సుందరరామశాస్త్రి పాత్రను గోవిందరాజుల సుబ్బారావు సమర్థవంతంగా పోషించారు. 'మాలపిల్ల' విడుదలకు ముందే తీవ్ర చర్చకు, వివాదాలకు కేంద్రంగా మారింది.

సినిమా గురించి పత్రికలో ప్రచురితమైన రివ్యూ అప్పట్లో సంచలనం సృష్టించి ప్రజల్లో చర్చకు దారితీసింది.

కొంతమంది విమర్శకులు ఈ చిత్రం సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణ్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు

సామాజిక ప్రగతికి దోహదపడింది

మరోవైపు కులమత భేదాలు, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇచ్చిందని, సామాజిక ప్రగతికి దోహదపడిందని మరికొందరు ప్రశంసించారు.

ఈ భిన్నమైన అభిప్రాయాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి.

సినిమాలో అసలు ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో జనం థియేటర్లకు భారీగా తరలివెళ్లారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ సారథి వారికి మంచి లాభాలు వచ్చాయి.

బాక్సాఫీస్ వద్ద 'మాలపిల్ల' భారీ వసూళ్లను సాధించింది. అలా ఈ సినిమా కేవలం వినోదానికే పరిమితం కాకుండా.. 1930ల నాటి తెలుగు సమాజంలో సామాజిక మార్పునకు ప్రతీకగా నిలిచింది.

ADVERTISEMENT