Loading...
Mrunal Thakur: 'వెంటనే తొలగించండి.. లేదంటే కోర్టుకెళ్తా'.. డీప్‌ఫేక్‌ ఫొటోలపై మృణాల్‌ సీరియస్ వార్నింగ్!
'వెంటనే తొలగించండి.. లేదంటే కోర్టుకెళ్తా'.. డీప్‌ఫేక్‌ ఫొటోలపై మృణాల్‌ సీరియస్ వార్నింగ్!

Mrunal Thakur: 'వెంటనే తొలగించండి.. లేదంటే కోర్టుకెళ్తా'.. డీప్‌ఫేక్‌ ఫొటోలపై మృణాల్‌ సీరియస్ వార్నింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేసి రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌ ఫొటోలు సెలబ్రిటీలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కూడా చేరారు. ఇటీవల ఎక్స్‌ (X)లోని ఓ పేజీలో మృణాల్‌కు సంబంధించిన మార్ఫింగ్ చేసిన డీప్‌ఫేక్‌ ఫొటోలు ప్రత్యక్షమవగా, అవి క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా డీప్‌ఫేక్‌ ఫొటోలను వెంటనే సోషల్ మీడియా నుంచి తొలగించండి. లేనిపక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె తన పోస్టులో హెచ్చరించారు.

వివరాలు

న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం

అంతేకాకుండా ఇకపై ఈ డీప్‌ఫేక్‌ ఫొటోలను ఎవరైనా షేర్ చేసినా వారిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని మృణాల్ స్పష్టం చేశారు.

ఇదే తరహా ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. ప్రముఖ నటి రష్మిక మందన్నతో పాటు పలువురు హీరోయిన్లు కూడా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌ కంటెంట్ బారిన పడ్డారు.

ఆ కేసుల్లో పోలీసులు కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సినీ ప్రముఖులు ఈ తరహా ఘటనలను తీవ్రంగా ఖండించారు.

టెక్నాలజీని ఈ విధంగా దుర్వినియోగం చేయడం అత్యంత హేయమైన చర్య అని వ్యాఖ్యానిస్తూ, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఘటనతో మరోసారి డీప్‌ఫేక్‌ దుర్వినియోగంపై చర్చ మొదలైంది.

ADVERTISEMENT